క్యాష్ లెస్ మ్యారేజ్ అంటే ఇదేనేమో.. పెళ్లిలో కానుకల కోసం క్యూఆర్ కోడ్ అంటించుకున్న పెళ్లి కూతురు తండ్రి

క్యాష్ లెస్ మ్యారేజ్ అంటే ఇదేనేమో.. పెళ్లిలో కానుకల కోసం క్యూఆర్ కోడ్ అంటించుకున్న పెళ్లి కూతురు తండ్రి

పెళ్లి పిలుపు వస్తే చాలు.. ఆ పెళ్లికి వెళ్లే బంధువులు, ఫ్రెండ్స్ ఇళ్లల్లో ఓ డిస్కషన్ నడుస్తుంది. పెళ్లికి గిఫ్ట్ ఏం తీసుకెళ్లాలి..  ఎంతలో తీసుకెళ్లాలి అనేది. గిఫ్ట్ పెద్దదిగా ఉండాలి డబ్బులు తక్కువగా ఉండాలి.. గిఫ్ట్ బాగుండాలి ధర తక్కువగా ఉండాలి.. గిఫ్ట్ ఏదీ అనుకోకపోతే డబ్బులు ఇవ్వాలి.. ఎంత ఇవ్వాలి అనేది.. ఇచ్చే డబ్బులకు మళ్లీ ఓ ఎన్విలప్ కవర్.. దానిపై పేర్లు రాయటం ఇంత ఉంటుంది... అతిధులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా కేరళ రాష్ట్రంలోని ఓ పెళ్లి కూతురు తండ్రి ఓ అద్భుతమైన ఐడియా ఆలోచించాడు.. అతిధుల టెన్షన్ తగ్గించటమే కాకుండా.. దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాడు. ఏంటా ఐడియా అనేది ఇప్పుడు తెలుసుకుందామా...

పెళ్లిల్లో బంధువులు చదివించే కట్న కానుకల కోసం పెళ్లి కూతురు తండ్రి క్యూఆర్ కోడ్ జేబుకు అతికించుకోవడం వైరల్ గా మారింది. ఐదు వందల నోటుకు చిల్లర ఉందా, అరెరే ఏటీఎం నుంచి క్యాష్ తీసుకురావడం మర్చిపోయానే.. అనే సమస్యే రాకుండా.. క్యాష్ లెస్ గా కనుకలు సమర్పించేలా క్యూ ఆర్ కోడ్ తో ప్రత్యక్ష మయ్యాడు. క్యాష్ లేదా ఏం పర్లేదు.. పేటీఎం చేయండి. మీరు చదించిందెందో కానుకల బుక్ లో రాసేస్తాం.. అని బంధువులకు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. క్యాష్ తీసుకొచ్చి, ఎన్వలప్ కవర్ లో పెట్టి గిఫ్ట్ గా ఇచ్చే కంటే క్యాష్ లెష్ గిఫ్ట్ పద్ధతి బాగుందని ప్రొసీడయ్యారు. 

►ALSO READ | కూతురు చనిపోయిన దుఃఖంలో ఉంటే.. లంచం అంటూ పీక్కుతిన్నారు: ఓ అధికారి వెలుగులోకి తెచ్చిన నమ్మలేని నిజం

డిజిటల్ వరల్డ్ లో పెళ్లిళ్లు కూడా క్యాష్ లెస్ గా మారిపోతున్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈయన ఐడియాకు బంధువులు కూడా ఇంప్రెస్ అయ్యారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా భలే కొత్తగా ఆలోచించారని అభినందించారు. అంతే కాకుండా చేతిలో చిల్లర ఉన్నా కూడా.. అవి అవసరానికి వస్తాయిలే అనుకుని.. ఎగబడి పేటీఎం చేశారు. సంప్రదాయ వివాహాలలో డిజిటల్ వినియోగం బాగుందంటూ మెచ్చుకున్నారు. డిజిటల్ ఇండియా ట్రాన్స్ ఫార్మేషన్ కు ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటూ నెటిజన్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by INDIA ON FEED (@indiaonfeed)