ఆస్ట్రేలియాలో ఆస్పత్రుల బయట అత్యవసర టెంట్లు

ఆస్ట్రేలియాలో ఆస్పత్రుల బయట అత్యవసర టెంట్లు

సిడ్నీ: లాక్ డౌన్ వ్యతిరేక నిరసనలు ఎదుర్కొంటున్న ఆస్ర్టేలియాలో కరనా మళ్లీ పడగ విప్పుతోంది. చాలా కాలం తర్వాత తాజాగా వెయ్యికిపైగా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా మొదలైన తర్వాత తొలిసారిగా ఇప్పుడు సిడ్నీ నగరంలోని ఆస్పత్రుల బయట అత్యవసర టెంట్లు ఏర్పాటు చేయడం ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. 
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 47 వేల 700 కేసులు 989 మరణాలు మాత్రమే సంభవించాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఒక్క న్యూ సౌత్ వేల్ రాష్ట్రంలోనే 1029 పాజిటివ్ కేసులు రాగా సిడ్నీ నగరంలో మరో 969 కేసులు వెలుగులోకి రావడంతో ఆస్ట్రేలియాలో మరోసారి కలకలం మొదలైంది.

కరోనా హాట్ స్పాట్ గా  సిడ్నీ నగరం మారిపోవడానికి ప్రధాన కారణం డెల్టా వేరియంట్ అని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నా కేసులు వెలుగులోకి రావడంతో ఆస్పత్రుల బయట టెంట్లు వేయిస్తున్నారు. మరో వైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించింది. రోజుకు 3 లక్షలకు పైగా వ్యాక్సిన్లు వేస్తుండగా.. ఈ సంఖ్యను వీలైనంత ఎక్కువ చేసే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.