బద్వేలు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి గా బీజేపీ పార్టీ పనతల సురేశ్ ను అధికారికంగా ప్రకటించింది. నిన్నటి వరకు ఎలాంటి ప్రకటన చేయని బీజేపీ..ఇవాళ(గురువారం) సంఘ్ మూలాలున్న యువ దళిత నేతవైపే పార్టీ మొగ్గు చూపింది. కడప జిల్లాకే చెందిన పనతల సురేశ్ మొదటి నుంచి సంఘ్ సంబంధిత సంస్థల్లోనే పనిచేస్తున్నారు.
ABVP కార్యకర్తగా మొదలై..BJPYMకు జాతీయ స్థాయిలోనూ నాయకత్వం వహించారు సురేశ్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నిక బరిలో నిలిచే తమ పార్టీ అభ్యర్థి సురేశ్ అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.
