
పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికలంటేనే మోడీ ఎన్నికలన్నారు. కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. తెలంగాణ పేరును తీసేసిన కేటీఆర్..పార్లమెంట్ లో తెలంగాణ వాదం లేనట్టేనని అనడం సిగ్గు చేటన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 6 లక్షల అప్పులు చేసిందని టైమ్ వేస్ట్ చేస్తుందని మండిపడ్డారు బండి సంజయ్. కొత్తగా ఎర్పడిన ప్రభుత్వం అని సమయం వృథా చేయొద్దన్నారు. మళ్లీ కాళేశ్వరం అని టైం వేస్ట్ చేయొద్దన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు సీబీఐ విచారణ అడిగిన కాంగ్రెస్ ..ఇపుడు ఎందుకు సీబీఐ విచారణను అడగడం లేదన్నారు. అప్పులు ఏవిధంగా తీర్చుతారో చెబితేనే పెట్టుబడులు వస్తాయన్నారు. డ్రగ్స్ కేసుపై నిజానిజాలన్నీ బయటకు తీయాలన్నారు. పేపర్ లీకేజీలో కేసీఆర్ పై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. 317 జీవోతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇబ్బందిపడుతున్నారని.. జీవోను సవరిస్తారా లేదా చెప్పాలన్నారు బండి సంజయ్.