బరాక్ ఒబామా ప్రవేశంపై రష్యా నిషేధం.. మరో 500మంది అమెరికన్‌లకూ షాక్

బరాక్ ఒబామా ప్రవేశంపై రష్యా నిషేధం.. మరో 500మంది అమెరికన్‌లకూ షాక్

వాషింగ్టన్ విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సహా 500 మంది అమెరికన్లకు ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు రష్యా తెలిపింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో యూఎస్ చట్టసభ సభ్యులు, మాజీ రాయబారులు కూడా ఉన్నారు. కానీ వీరిపై ఏ కారణం చేత నిషేధం విధించారన్న విషయాన్ని మాత్రం మాస్కో విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఆంక్షలతో పాటు బంధీగా ఉన్న వాల్ స్ట్రీట్ జర్నల్ ఇవాన్ గెర్ ష్కోవిచ్ కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని అమెరికా చేసిన అభ్యర్థనను కూడా రిజెక్ట్ చేసినట్టు మాస్కో స్పష్టం చేసింది.

గత నెల రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అమెరికా పర్యటనకు వెళ్లగా.. ఆ పర్యటనను కవర్ చేసేందకు రష్యన్ జర్నలిస్టుకు యూఎస్ వీసాలను తిరస్కరించింది. దానికి రిప్లైగానే ఇవాన్ కు కాన్సులర్ యాక్సెస్ ను తిరస్కరిస్తున్నట్టు మాస్కో ప్రకటించింది. గూఢచర్యం కేసులో ఇవాన్ ను ఈ ఏడాది మార్చిలో రష్యా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.