హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో 61% బీసీలు గెలవటంపై బీసీ కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ విజయం బీసీల్లో పెరిగిన చైతన్యానికి నిదర్శనమని కమిషన్ చైర్మన్ నిరంజన్, మెంబర్లు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సమగ్ర సర్వేలో బీసీల జనాభా 56.33 శాతంగా తేలినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిందన్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచడం, రిజర్వేషన్ అమలు కాకుండా కోర్టులకు వెళ్లటం బాధాకరమని వివరించారు. బీసీల రిజర్వేషన్లు అమలయ్యేలా కేంద్రం చొరవ చూపాలన్నారు.
