రిజర్వేషన్లు కల్పించకపోతే కేంద్రంపై యుద్ధం

రిజర్వేషన్లు కల్పించకపోతే కేంద్రంపై యుద్ధం
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్​ విశారదన్ మహారాజ్

ముషీరాబాద్, వెలుగు: బీసీలకు రిజర్వేషన్లు భిక్ష కాదని, బీసీల హక్కు అని.. రిజర్వేషన్లు కల్పించకపోతే కేంద్రంపై యుద్ధం తప్పదని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి రిజర్వేషన్లు సాధించాలని కోరారు. శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో మహా పోరాటం పేరుతో ధర్నా చేపట్టారు. 

ఈ కార్యక్రమానికి జస్టిస్ ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్​ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బూర నర్సయ్య గౌడ్, వి.హనుమంతరావు, మాజీ డీజీపీ పూర్ణచందర్రావు, చెరుకు సుధాకర్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సమితి కన్వీనర్ వెంకన్న గౌడ్  మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యమత్యంగా పోరాడి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే కేంద్రంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.