ఒక మామిడి పండు ధర..5 గ్రాముల గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సమానం

ఒక మామిడి పండు ధర..5 గ్రాముల గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సమానం

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రైతు సవాకత్ హుస్సెన్  ఓ అరుదైన మామిడి పండును ఏకంగా రూ.30 వేలకు అమ్మారు. అంటే ఈ మామిడి పండు ధర  5 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమానం. కిందటివారం సిలిగురిలో జరిగిన మాంగో  ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  జపనీస్ రకం మియజాకి మామిడి పండ్లను హుస్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా ఈ రకం మామిడికి పేరుంది. ఇవి కేజీకి రూ.2.75 లక్షలు పలుకుతున్నాయి.

మియజాకి మామిడిని పండించడానికి ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుందని, ఒక చెట్టుకి కేవలం  38  పండ్లే పండాయని హుస్సెన్ పేర్కొన్నారు.   ఇదే ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కోహితూర్ మామిడి  రూ.2,500 చొప్పున పలికింది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడంతో కేవలం అరుదైన లేదా స్పెషాలిటీ మామిడి మాత్రమే కాకుండా సాధారణ రకం మామిడి పండ్లు కూడా మంచి ధరకు అమ్ముడవుతున్నాయి. ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్కువగా ఉండడంతో యూఏఈ, యూకే, యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్వతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కువైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెనడా, సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భూటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి దేశాలకు ఎగుమతులు కూడా తగ్గాయి.

2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశాలకు రూ.360  కోట్ల విలువైన మామిడి పండ్లను ఎగుమతి చేశాం. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–జనవరి టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన అల్ఫొన్సో మామిడి పండ్లు ఒక్కొక్కటి రూ.5,000 చొప్పున అమ్ముడయ్యాయి. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐలు కూడా మంచి రకం మామిడి పండ్లకు ఎంత ధరైనా పెట్టడానికి ముందుకొస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.