దాచిపెట్టడానికేం లేదు.. అది జస్ట్ నోటీస్ మాత్రమే: నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్

దాచిపెట్టడానికేం  లేదు.. అది జస్ట్ నోటీస్ మాత్రమే: నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్

రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరణ అంశంపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయగా.. తెలంగాణలో నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించి నామినేషన్ పత్రాల్లో పొందుపర్చలేదనే కారణంతో నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. 

అయితే ఈ అంశంపై కాంగ్రెస్ సహా అనుబంధ పార్టీలీ తీవ్రంగా స్పందించాయి.  ఇన్నా్ళ్లూ ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రముఖ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై  మీనాక్షి నటరాజన్ స్పందించారు. 

మీడియాతో మాట్లాడిన నటరాజన్.. బీజేపీకి మధ్యప్రదేశ్ అసెంబ్లీలో అవసరమైన సంఖ్యా బలం లేనప్పటికీ రాజ్యసభకు నామినేషన్ వేసింది. ప్రారంభంలో క్రాంస్ ఓటింగ్ తో గెలవాలనుకుందని.. ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులపై ఆధారపడిందని.. లేటెస్టుగా.. కాంగ్రెస్ యూనిటీని దెబ్బ తీసేందుకు కొత్త స్ట్రాటజీ మొదలుపెట్టినట్లు విమర్శించారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ యూనిటీ చూసి.. ఓడిపోతామని తెలిసి.. కొత్త రాగం ఎత్తుకందని కౌంటరిచ్చారు. 

  • అది క్రిమినల్ కేసు కాదు.. నోటీసు మాత్రమే:

తనపై క్రిమినిల్ కేసు నమోదు కాలేదని.. అది కేవలం నోటీసు మాత్రమేనని నటరాజన్ అన్నారు. కోర్టు ఆ కేసును పరిగణనలోకి తీసుకోలేదని.. కేసు రిజిస్టర్ కాలేదని తెలిపారు. నోటీసులను నామినేషన్ అఫిడవిట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. 

ఒక వేళ క్రిమినల్ కేసు అయి ఉండి.. కోర్టు పరిగణనలోకి తీసుకుని, ఏవైనా అభియోగాలు ఉంటే అప్పుడు దాచిపెట్టినట్లు ఆరోపించడం సమంజసంగా ఉండేది.. కానీ కేసు లేనప్పుడు.. దాచి పెట్టారని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు.