బోధన్, వెలుగు : జిల్లాలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని, బోధన్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్కులాచారి అన్నారు. సోమవారం బోధన్‌లోని ఎంపీఆర్ ఆఫీస్‌లో బీజేపీ అభ్యర్థులకు బీఫాంలు అందజేసి మాట్లాడారు. ప్రజాధనాన్ని దోచుకున్న బీఆర్ఎస్ను, ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌లకు రాబోవు రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, వడ్డి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రాంచందర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీధర్, ఐటీ కన్వీనర్ శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు గోపి, ఎడపల్లి మండలాధ్యక్షుడు ఇంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు.
