బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడగట్లే? : ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి

బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడగట్లే? :  ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని ప్రశ్నించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత బీఆర్ఎస్‌‌‌‌ హయాంలో జరిగిన అవినీతిపై  ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడంలేదని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్‌‌‌‌  మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్‌‌‌‌ చేసిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ అడిగితే 24 గంటల్లో  చేయించేందుకు తాము సిద్ధమని అన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాల్వాయి హరీశ్‌‌‌‌తో కలిసి  మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడారు.

 కాళేశ్వరంపై వేసిన జ్యుడీషియల్​ కమిషన్ రిపోర్ట్​పై మాత్రమే రాష్ట్ర సర్కారు సీబీఐ ఎంక్వైరీ కోరిందని, కానీ లక్ష కోట్ల అవినీతిపై ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. మిషన్​భగీరథ, సివిల్‌‌‌‌ సప్లై స్కామ్‌‌‌‌లపై ఎందుకు విచారణ​కోరలేదని అడిగారు. మొంథా తుఫాన్‌‌‌‌ వల్ల జరిగిన పంటనష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మొత్తాన్ని పెంచాలని ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి డిమాండ్ చేశారు.