మోదీ బర్త్ డే సందర్భంగా సేవాపక్షం అభియాన్ : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

మోదీ బర్త్ డే సందర్భంగా సేవాపక్షం అభియాన్ : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
  • 17నుంచి 15 రోజులపాటు నిర్వహిస్తం: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే ను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 'సేవా పక్షం అభియాన్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తెలిపారు.  15 రోజుల పాటు  సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో  17న తెలంగాణ విమోచన దినోత్సవం కూడా నిర్వహించుకుంటున్నట్లు గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో   మీడియాతో కొమరయ్య మాట్లాడారు. సమాజం పట్ల మన బాధ్యతను, సేవ ఆవశ్యకతను 'సేవా పక్షం అభియాన్' కార్యక్రమం తెలియజేస్తుందన్నారు.

మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని కొమరయ్య వెల్లడించారు. 2047 నాటికి భారత్‌‌ను ప్రపంచంలో నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. జీఎస్టీని తగ్గించి  రైతులు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించారని పేర్కొన్నారు.