శాంటా ముసుగులో చొరబాటుదారులు వస్తారు.. జాగ్రత్త: ట్రంప్‌‌‌‌

శాంటా ముసుగులో చొరబాటుదారులు వస్తారు.. జాగ్రత్త: ట్రంప్‌‌‌‌

వెస్ట్ పాం బీచ్: శాంటా క్లాజ్ ముసుగులో అమెరికాలోకి చొరబాటుదారులు ప్రవేశించే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ అన్నారు. వారిని దేశంలోకి చొరబడనివ్వకుండా చూడాలని పిల్లలకు సూచించారు. గురువారం ఫ్లోరిడాలోని ఎస్టేట్‎లో ఆయన క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. 

ఈ సందర్భంగా సంప్రదాయ డయలింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఆయన పలువురు చిన్నారులతో ఫోన్‎లో మాట్లాడారు. ‘‘శాంటా మంచివాడిగా ఉండేలా చూసుకోవాలి. దొంగ శాంటాలు దేశంలోకి చొరబడకుండా జాగ్రత్తగా ఉండాలి” అని ట్రంప్ సూచించారు. అయితే, గతంలో మాదిరిగా ఈసారి క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రత్యర్థులపై విమర్శలకు ట్రంప్ దూరంగా ఉన్నారు.