కెనడాలో బెంగళూరు టెకీని కాల్చిచంపిన దుండగులు..టార్గెట్ చేసి చంపేశారా?

కెనడాలో బెంగళూరు టెకీని కాల్చిచంపిన దుండగులు..టార్గెట్ చేసి చంపేశారా?

కెనడాలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్యకు గురయ్యారు.ఓ షాపింగ్ మాల్ ఎంట్రన్స్ దగ్గర కారులో ఉన్న టెకీపై దుండగులుకాల్పులు జరపడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు గత కొంతకాలంగా కెనడాలోని టోరంటోలో ఉంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఇండియాకు వచ్చేందుకు సిద్దమవుతున్న టెకీపై కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. టెకీ హత్యపై టోరంటో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

కెనడాలోని టోరంటో నగరంలో  బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చందన్ కుమార్ రాజా శనివారం (ఫిబ్రవరి7) దారుణ హత్య గురయ్యారు. టోరంటోలోని ఓ షాపింగ్ మాల్ ముందు పార్కింగ్ చేసిన కారులో ఉన్న చందన్ కుమార్ రాజాపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్సకోసం ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఘటనస్థలంలో దృశ్యాలు చందన్ కుమార్ రాజాపై  ఉద్దేశపూర్వకంగా నే   దుండగులు దాడి చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. 

బెంగళూరు రూరల్ జిల్లాలోని నేలమంగళికి చెందిన చందన్ కుమార్ రాజా స్వస్థలం. ఆరేళ్లక్రితం కెనడాకు వెళ్లిన చందన్.. LTI మైండ్ ట్రీ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతంలో బెంగళూరు కాగ్నిజెంట్ లో కూడా పనిచేశాడు. సమ్మర్ లో ఇండియాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాడు. 

చందన్ కుమార్ పేరెంట్స్ కూడా అతని  మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. త్వరలో పెండ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం.. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని  అతని తల్లిదండ్రులు కన్నీమున్నీరయ్యారు.చందన్ కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో చురుకుగా పనిచేశాడని..కమ్యూనిటీ సభ్యులను ఏకతాటిపైకి తెచ్చి సంఘం ఏర్పాటుకు కృషి చేస్తున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. 

సంఘటనాస్థలంలో చందన్ వైట్ కారు బుల్లెట్ల తూట్లతో నిండిపోయింది. చందన్ పై టార్గెట్ గా దాడి జరిగింది దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. కాల్పుల అనంతరం నిందితులు మరో వాహనంలో పారిపోయారు. ఇప్పటివరకు నిందితులు ఎవరూ అరెస్ట్ కాలేదు. ఇది ఈ ఏడాది టోరంటోలో జరిగిన మూడో హత్య కావడం కలకలం రేపుతోంది. 

ఇక చందన్ కుమార్ రాజా భౌతిక కాయాన్ని ఇండియా కు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని  కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర తెలిపారు. విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకొని చందన్ మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.