ఎప్‌స్టీన్ ఫైళ్లలో సంచలనం: మస్క్, జుకర్‌బర్గ్‌తో విందు ఫొటోలు బయటకు

 ఎప్‌స్టీన్ ఫైళ్లలో సంచలనం: మస్క్, జుకర్‌బర్గ్‌తో విందు ఫొటోలు బయటకు

జెఫ్రీ ఎప్ స్టీన్ కు సంబంధించిన తాజా ఫైళ్లలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కాలిఫోర్నియాలో ఎప్‌స్టీన్ తో కలిసి విందులో పాల్గొన్నారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ మైనర్ల అక్రమ రవాణా కేసులో 2008లో దోషిగా తేలిన తర్వాత కూడా ఈ పార్టీ జరిగినట్లు పత్రాలు చెబుతున్నాయి. 

పొడవైన డైనింగ్ టేబుల్ వద్ద మస్క్, జుకర్ బర్గ్ ఎదురెదురుగా కూర్చున్న ఫొటోను ఎప్పీన్ స్వయంగా 2015 ఆగస్టు 3న తనకే తాను ఈమెయిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో లింక్డ్‌ఇన్ సహవ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్, పేపాల్ సహవ్యవ స్థాపకుడు పీటర్ థీల్ కూడా ఉన్నట్లుఎప్‌స్టీన్ ఇతర ఈమెయిళ్లలో పేర్కొన్నాడు. ఆ డిన్నర్ను అతడు వైల్డ్ అని వర్ణించాడు. 

►ALSO READ | రష్యాలో భారత విద్యార్థులపై పెరుగుతున్న జాతి వివక్ష.. భారీగా పెరుగుతున్న కంప్లెయింట్స్

ఇటీవల ఎలాన్ మస్క్ తాను ఎప్పుడూ ఎప్‌స్టీన్ పార్టీలకు వెళ్లలేదని ప్రకటించడం గమనార్హం. ఎప్‌స్టీన్ తో నేరాలకు పాల్పడిన వారిపై కేసులు పెట్టాలన్నదే నిజమైన న్యాయం అని కూడా మస్క్ వ్యాఖ్యానించారు. ఈ ఫొటో ఆ ప్రకటనలపై సందేహాలు పెంచుతోంది. ఈ డిన్నర్ పార్టీ విషయాన్ని 2019లోనే వానిటీ ఫెయిర్ వెల్లడించింది. ఎంఐటీ శాస్త్రవేత్త కోసం ఈ విందును రీడ్ హాఫ్‌మన్ ఏర్పాటు చేసినట్లు అప్పట్లో
తెలిపింది. హాఫ్‌మన్ మాత్రం ఎప్‌స్టీన్ తో తన సంబంధాలపై విచారం వ్యక్తం చేస్తూ.. అవి కేవలం ఎంబటీకి నిధుల సేకరణ కోసమేనని స్పష్టం చేశారు. ఇటీవల ఎప్‌స్టీన్ ఫైళ్లలో పేర్లు రావడంతో మస్క్, హాఫ్‌మన్ మధ్య సోషల్ మీడియాలో తీవ్ర మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ ఫోటో వెలుగులోకి రావడంతో ఎప్‌స్టీన్ వ్యవహారం మరోసారి అమెరికా రాజకీయ, కార్పొరేట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.