పానీపూరీ అమ్మే వ్యక్తికి అరుదైన గౌరవం.. మిస్ టీన్ తెలంగాణగా భద్రాచలం బిడ్డ

 పానీపూరీ అమ్మే వ్యక్తికి అరుదైన గౌరవం.. మిస్ టీన్ తెలంగాణగా భద్రాచలం బిడ్డ
  • పానీపూరీ అమ్మే వ్యక్తికూతురుకు అరుదైన గౌరవం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలో పానీపూరీ అమ్మే వ్యక్తి కుమార్తెకు అరుదైన గౌరవం లభించింది. ఈనెల19 నుంచి 21 వరకు జైపూర్​ పట్టణంలో జరిగిన ఫరెవర్​ మిస్​ టీన్​ ఇండియా పోటీల్లో భద్రాచలానికి చెందిన ప్రీతీ యాదవ్​ గ్రాండ్ ఫినాలేలో మిస్​ టీన్​ తెలంగాణ విజేతగా నిలిచింది. ఈమె తండ్రి ప్రకాశ్​ భద్రాచలంలో పానీపూరీ అమ్ముతారు. దేశం నలుమూలల నుంచి 10వేల కంటే ఎక్కువ దరఖాస్తులు రాగా, అనేక పరీక్షల తర్వాత తెలంగాణ స్టేట్​ నుంచి 101 మంది ఎంపికయ్యారు. వారిలో ప్రీతీయాదవ్​ కూడా ఉన్నారు. 

తిరిగి వీరి మధ్య జరిగిన పోటీల్లో చివరకు గ్రాండ్​ పినాలే విజేతగా నిలిచారు. ఫరెవర్​ మిస్​ టీన్​ తెలంగాణ -2025 కిరీటాన్ని ఆమె పొందారు. భద్రాచలంలోని అశోక్​నగర్​ కొత్తకాలనీలో నివాసం ఉంటున్న ప్రకాశ్​ 20 ఏండ్ల కిందనే ఉత్తరప్రదేశ్​ నుంచి వచ్చి స్థిరపడ్డారు. ప్రీతీయాదవ్​ భద్రాచలంలోని ఓ స్కూల్​లో 8వ తరగతి  చదువుతోంది.