హైదరాబాద్ ఆలయాల్లో మోదీ సతీమణి పూజలు

హైదరాబాద్  ఆలయాల్లో మోదీ సతీమణి పూజలు

ఓల్డ్​సిటీ/వికారాబాద్​, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్​ గురువారం చార్మినార్​ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్​దర్వాజ సింహవాహిని అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. చాంద్రాయణగుట్టలోని లక్ష్మి చెన్నకేశవస్వామి, భూలక్ష్మమ్మ దేవాలయం, శ్వేతగంగ, జగన్నాథ స్వామి ఆలయాల్లో పూజలు చేశారు.18 మంది బంధువులతో కలిసి ఆమె ఈ ఆధ్యాత్మిక పర్యటనకు వచ్చారు. అనంతరం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నాగదేవత ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.