అధిక ఫీజులను అరికట్టాలి...బీజేవైఎం కార్యకర్తల ఆందోళన

అధిక ఫీజులను అరికట్టాలి...బీజేవైఎం కార్యకర్తల ఆందోళన

హైదరాబాద్ లక్డీకపూల్ లోని  డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలలో అధిక ఫీజులను అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టంను అమలు చేయాలంటూ BJYM నాయకులు ఆందోళనకు దిగారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో BJYM నాయకులు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత BJYM నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

BJYM డిమాండ్స్

  • అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టం ఏర్పాటు చేయాలి.
  • ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కాకుండా పాఠశాలలో మెరుగైన మౌలిక, ఆధునిక వసతులు కల్పిస్తూ, విద్యా శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలి. 
  • ఒకే పేరుతో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలను నిషేధించాలి.