
పద్మారావునగర్, వెలుగు : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా సోమవారం సిటీలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సనత్ నగర్ బీజేపీ నాయకులు తెలిపారు.
బీజేపీ నేత మర్రి పురూరవ రెడ్డి ఆధ్వర్యంలో అమీర్ పేట గురు గోవింద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పేదలకు బ్లాంకెట్ల పంపిణీతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుందని నేతలు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.