ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు

ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం సుదర్శన్ రెడ్డికి సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఛాంబర్ కేటాయించింది. తన ఛాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించే బాధ్యతను కేబినేట్ హోదాతో ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.