కొవాగ్జిన్ ట్రయల్స్ ను నిలిపేసిన బ్రెజిల్

V6 Velugu Posted on Jul 24, 2021

కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ను బ్రెజిల్ నిలిపేసింది. ఆ దేశంతో జరిగిన అగ్రిమెంట్ ను భారత్ బయోటెక్ రద్దు చేయడంతో ట్రయల్స్ ను ఆపేస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ(అన్వీసా)కు భారత్ బయోటెక్ పంపించిన ప్రకటన తర్వాతే ట్రయల్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది.

బ్రెజిల్ కు చెందిన ప్రెసీసా మెడికమెంటోస్ తో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది. కొవాగ్జిన్ రెగ్యులేటరీ అనుమతుల కోసం అన్వీసాతో కలిసి పనిచేస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. అయితే.. సంస్థతో రద్దయిన అగ్రిమెంట్ తో పాటు.. క్లినికల్ ట్రయల్స్ నూ నిలిపివేస్తూ బ్రెజిల్ నిర్ణయించింది. 

2 కోట్ల డోసులను సరఫరా చేసేలా బ్రెజిల్ తో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది. కానీ, ఆ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని.. ప్రెసీసా అనే సంస్థను ముందుపెట్టి ఆ దేశ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో భారత్ బయోటెక్ .. ప్రెసీసాతో అగ్రిమెంట్ ను రద్దు చేసుకుంది.

Tagged Brazil, Covaxin clinical trials, suspends, Bharat Biotech

Latest Videos

Subscribe Now

More News