
- ఎల్లుండి నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు
- ప్రత్యేక స్ట్రాటజీస్ రూపొందిస్తున్న హైకమాండ్
- అసెంబ్లీ ఎన్నికల తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ఎన్నికలపై బీఆర్ఎస్హైకమాండ్ ఫోకస్పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్‌కాకుండా జాగ్రత్త పడుతోంది. ఫిబ్రవరి నెలాఖరుకు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్వచ్చే అవకాశముండటంతో ముందే ఎన్నికలకు ప్రిపరేషన్షూరూ చేసింది. బుధవారం నుంచి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నద్ధతపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నుంచి లోక్‌సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలలో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయా పార్టీలు వేస్తున్న అడుగులకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రత్యేక స్ట్రాటజీలు రూపొందిస్తున్నట్టుగా పార్టీ పెద్దలు చెప్తున్నారు. ముఖ్యంగా మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం పార్లమెంట్నియోజకవర్గాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ముఖ్య నేతలు పోటీకి దిగొచ్చనే అంచనాతో వారిని ఢీకొట్టేందుకు బీఆర్ఎస్లోని టాప్ లీడర్లు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అమిత్‌షా, సోనియా, ప్రియాంక రాష్ట్రం నుంచి పోటీకి దిగితే వారిని ఢీకొట్టడానికి పార్టీ టాప్లైన్నేతలే రెడీ అవుతున్నారు. తాము కాకుండా వేరే లీడర్లను అక్కడ పోటీకి దింపితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అలాంటి వాటికి ముందే చెక్‌పెడితే ఎన్నికలను ఎదుర్కోవడం అంతకష్టం కాదని పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు.
ఫిబ్రవరిలో కేసీఆర్ రీ ఎంట్రీ!
ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్సీటు చేవెళ్లను నిలబెట్టుకోవాలని.. అందుకే ఇప్పటి నుంచే ఫీల్డ్‌లో ఉండాలని నాయకులకు సూచించారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జనవరి నెలాఖరుకు పూర్తిగా రికవరీ అవుతారని, ఆపై ఆయన ఆధ్వర్యంలోనే లోక్‌సభ ఎన్నికల స్ట్రాటజీలపై సమావేశాలు ఉంటాయని నాయకులు చెప్తున్నారు. బుధవారం నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన లోక్‌సభ నియోజకవర్గాలవారీగా రివ్యూలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన పెద్దపల్లి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ నెల 3న ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంతో నియోజకవర్గాలవారీగా పార్టీ సన్నద్ధతపై సమావేశం నిర్వహిస్తున్నారు. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల సంక్రాంతి పండుగ విరామం తర్వాత 16వ తేదీ నుంచి మళ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. 16న నల్గొండ, 17న నాగర్‌కర్నూల్, 18న మహబూబ్‌నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అభిప్రాయాలు తీసుకున్నాకే అభ్యర్థుల ఫైనల్
2009 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్11 స్థానాల్లో విజయం సాధించగా, 2019లో 9 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పదేండ్ల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్అధికారం కోల్పోయింది. కాంగ్రెస్64 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్39 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటి రాష్ట్ర ప్రజల్లో తమకు ఆదరణ ఉందని చూపించుకోవాలనే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ఉంది. ఈక్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు పడుతోంది. నియోజకవర్గ స్థాయిలో నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొనే అభ్యర్థులను ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోని ముఖ్య నేతలందరినీ సమీక్ష సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. ఇదే సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పోస్ట్‌మార్టం నిర్వహించడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీలతో ముందుకెళ్లాలో చర్చించి నిర్ణయాలు తీసుకోకున్నారు. కేసీఆర్ కోలుకున్నాక మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీపై క్లారిటీ వస్తుందని, అప్పటి వరకు రాష్ట్రంలోని హైదరాబాద్మినహా మిగతా 16 లోక్‌సభ స్థానాలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించామని బీఆర్ఎస్ముఖ్య నేతలు చెప్తున్నారు.