
కొమురవెల్లి, వెలుగు: ఉద్యోగం రావట్లేదని మనస్తాపంతో సిద్దిపేట జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొమురవెల్లి మండలం అయినాపూర్‌కు చెందిన కొత్త శ్రీనివాస్ కొడుకు ప్రదీప్ రెడ్డి(26) బీటెక్ పూర్తి చేశాడు. కొంత కాలంగా ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నాడు. 4 రోజుల క్రితం ఉద్యోగం కోసం పోతున్నట్లు ఇంట్లో చెప్పిన ప్రదీప్‌రెడ్డి.. హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ 2 రోజులు ఉన్న తర్వాత సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జికి వెళ్లాడు. ఆ లాడ్జ్ లోనే ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.