- సీనియర్ల ర్యాగింగ్, హెచ్‌వోడీ మందలింపే కారణం!
- పోచారం శ్రీనిధి కాలేజీలో ఘటన
ఘట్కేసర్, వెలుగు: కన్నతల్లి, బంధువుల కళ్ల ముందే ఓ బీటెక్ విద్యార్థి కాలేజీ మూడో అంతస్తు నుంచి కింద దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్, హెచ్‌వోడీ మందలింపులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బాధిత కుటుంబసభ్యులు, బంధువుల వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన గంట కల్యాణ్ మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని శ్రీనిధి ఇంజినీరింగ్‌కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు. హాస్టల్లోఉండే సీనియర్ విద్యార్థులు సిగరెట్లు తెచ్చి వారు చెప్పిన వారికి ఇవ్వాలని కల్యాణ్‌ను ర్యాగింగ్చేశారు. బుధవారం అతను సిగరెట్లు తెస్తుండగా, హెచ్‌వోడీ చూసి తన తల్లిదండ్రులను కాలేజీకి రమ్మని చెప్పాడు.
గురువారం అతని తల్లి, బంధువులు కాలేజీకి వచ్చి హెచ్‌వోడీని కలవగా, అతను కల్యాణ్‌ను సిగరెట్ల విషయంలో తిట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కల్యాణ్ వాష్‌రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి, కాలేజీ మూడో అంతస్తు నుంచి కింద దూకాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన జోడిమెట్లలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. కల్యాణ్ కాళ్లు, వెన్నుముక విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు.
