కాశ్మీర్లోని ఫెమస్ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో ఈ రోజు (25 మే) సోమవారం ఓ ప్రమాదం జరిగింది. ఇక్కడి ప్రముఖ కేబుల్ కార్ (గోండోలా) సర్వీసులో సాంకేతిక లోపం రావడంతో దాదాపు 300 మంది పర్యాటకులు గాలిలోనే చిక్కుకుపోయారు. కేబుల్ కార్లు ఒక్కసారిగా గాల్లోనే నిలిచిపోవడంతో ప్రయాణికుల్లో, ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ విషయం తెలియగానే ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహా స్థానిక అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టి, గాల్లో చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా కిందకు దించారు.
ALSO READ : ఆధార్ వినియోగదారులకు అలర్ట్
ప్రస్తుతానికి పర్యాటకులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపానికి గల కారణాలను ఇంజనీర్లు పరిశీలిస్తున్నారు. ఆసియాలోనే అత్యంత ఎత్తైన ఈ కేబుల్ కార్ వ్యవస్థలో ఇలాంటి అంతరాయాలు మళ్లీ జరగకుండా భద్రతపై పూర్తి విచారణ జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది.
