హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: హైదరాబాద్-ముంబై హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు...

హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: హైదరాబాద్-ముంబై హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు...

హైదరాబాద్ ముంబై హైవేపై రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో మే 24 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. నోవోపాన్ జంక్షన్ దగ్గర జరుగుతున్న అండర్ పాస్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. 

ORR, సంగారెడ్డి నుండి పటాన్‌చెరు వైపు వెళ్లే వాహనాలను పోచారం కమాన్ దగ్గర ఎడమవైపు సర్వీస్ రోడ్డు మీదుగా పటాన్‌చెరు వెజిటేబుల్ మార్కెట్ రోడ్డు వరకు మళ్లించి, అక్కడ నుండి తిరిగి NH-65 లోకి కలుపుతున్నారు.

పటాన్‌చెరు నుండి సంగారెడ్డి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను , ఇంకార్ లేక్ సిటీ అపార్ట్‌మెంట్స్ సమీపంలోని రామ్కీ ఇన్ఫ్రా టవర్ వరకు కుడివైపు సర్వీస్ రోడ్డుపైకి మళ్లించి, ఆ తర్వాత తిరిగి NH-65 లోకి కలుపుతున్నారు. హైవే పనులు పూర్తయ్యే వరకు దారి మళ్లింపులు కొనసాగుతాయని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు.

►ALSO READ | హైదరాబాద్లో అడ్వకేట్ను కారుతో ఢీ కొట్టి చంపింది ఇతనే..!