స్వీడన్‌లో సంతోషంగా 40% టాక్స్ కడుతున్నాం.. ఇండియా తిరిగి రానంటున్న తిరుపతి అమ్మాయి.. ఎందుకంటే?

స్వీడన్‌లో సంతోషంగా 40% టాక్స్ కడుతున్నాం.. ఇండియా తిరిగి రానంటున్న తిరుపతి అమ్మాయి.. ఎందుకంటే?

ఏడేళ్ల కిందట తిరుపతి పక్కన చిన్న టౌన్ నుండి ఓ తెలుగు అమ్మాయి డిపెండెంట్ స్పౌజ్ వీసాపై స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో అడుగుపెట్టింది. అప్పట్లో ఆమెకు ఆ దేశం గురించి.. అక్కడి భాష గురించి కనీస అవగాహన కూడా లేదు. కట్ చేస్తే... ఈరోజు ఆమె స్వీడన్‌లోని ప్రముఖ గ్లోబల్ కంపెనీ 'స్కేనియా'లో సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఇద్దరు పిల్లల తల్లిగా.. ఒక సక్సెస్‌ఫుల్ ఎన్‌ఆర్‌ఐగా మారింది. తనకు టాక్సుల భారం ఎక్కువైనా పర్లేదు.. స్వీడనే బెస్ట్ అంటూ ఇండియాకు రిటర్న్ వచ్చే ప్రసక్తే లేదని చెబుతోంది క్రేజీ తెలుగు అమ్మాయి చంద్రిక.

ఇండియాలో కాగ్నిజెంట్ లాంటి టాప్ కంపెనీల్లో SAP కన్సల్టెంట్‌గా మంచి కెరీర్ ఉన్న చంద్రిక.. 2018లో తన భర్తకు స్వీడన్‌లో ఉద్యోగం రావడంతో అక్కడికి షిఫ్ట్ అయింది. కొత్త దేశంలో ఎంటర్ అయిన మెుదట్లో రోజులు నరకంలా అనిపించాయి. ఇంట్లో టీవీ కూడా లేదు. మాట్లాడటానికి మనుషులు లేరు. భయంకరమైన ఒంటరితనం. చేతిలో ఉద్యోగం లేదు.. స్థానిక భాష రాదు, ఎవరితోనూ పరిచయాలు లేవు. వీటన్నింటితో భయపడి వెనక్కి తగ్గకుండా ఉచితంగా స్వీడిష్ లాంగ్వేజ్ నేర్పించే క్లాసుల్లో చేరి భాష నేర్చుకుంది. ఇక్కడి పద్ధతికి తగ్గట్టు సీవీ మార్చి.. ఒక తెలుగు కన్సల్టింగ్ ఫర్మ్ ద్వారా మొదట ఎలక్ట్రోలక్స్, ఆ తర్వాత స్కేనియా కంపెనీలో సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌గా స్థిరపడింది.

చంద్రిక ఇండియాకు తిరిగి రాననడానికి ప్రధాన కారణం అక్కడి అద్భుతమైన ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్. స్వీడన్‌లో ఒక బిడ్డ పుడితే తల్లిదండ్రులకి కలిపి ఏకంగా 480 రోజుల పెయిడ్ లీవ్స్ ఇస్తారు. బిడ్డకు 12 ఏళ్లు వచ్చేలోపు ఎప్పుడైనా ఈ సెలవులను వాడుకోవచ్చు. డేకేర్ సౌకర్యాలు కూడా ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుంది. పిల్లల కోసం ఆఫీస్‌కు లీవ్ పెడుతుంటే అక్కడ ఎవరూ గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదట. సమాజం, ఆఫీస్ మేనేజ్మెంట్ వర్కింగ్ మదర్స్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తాయని చంద్రిక చెబుతోంది.

స్వీడన్‌లో చంద్రికకు బాగా నచ్చిన మరో క్రేజీ విషయం వర్క్-లైఫ్ బ్యాలెన్స్. ఉదయాన్నే ఆఫీస్ పని స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటలకు కచ్చితంగా ముగుస్తుంది. ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాక బాస్ నుంచి ఫోన్ కాల్స్, అర్జెంట్ ఈమెయిల్స్ అస్సలు ఉండవట. వీకెండ్స్ వస్తే పూర్తిగా ఫ్యామిలీకే టైమ్. 10 ఏళ్లు, 3 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలను పెంచడానికి ఇంతకంటే ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ దొరుకుతుందని చంద్రిక ప్రశ్నిస్తోంది.

ALSO READ : అస్సాంలో కోత్త చట్టం..: సహజీవనం చేస్తే రిజిస్ట్రేషన్ తప్పనిసరి

యూరప్ అనగానే అందరూ కలల ప్రపంచం అనుకుంటారు. కానీ అక్కడో ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. స్వీడన్‌లో సంపాదనపై దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ట్యాక్స్ కట్టాల్సిందే. పైగా స్టాక్‌హోమ్‌లో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. అక్కడ మీకు లైఫ్ స్టెబిలిటీ దొరుకుతుంది కానీ.. భారీగా డబ్బులు దాచుకుందాం అంటే కుదరదట. వచ్చే జీతంలో చాలా భాగం ఇల్లు గడవడానికే సరిపోతుందని చంద్రిక అంటోంది.

2026 నుంచి స్వీడన్ పౌరసత్వం కోసం కొత్త రూల్స్ వస్తున్నా.. చంద్రిక ఫ్యామిలీ మాత్రం స్వీడన్ వదిలిపెట్టకూడదని డిసైడ్ అయింది. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే... పిల్లల భవిష్యత్తు, భద్రత, కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణం, పీస్ ఫుల్ లైఫ్‌కు స్వీడనే బెస్ట్ ఆప్షన్ అని చెప్తోంది చంద్రిక. అలాగే స్టాక్‌హోమ్‌లో ఒక చక్కని తెలుగు కమ్యూనిటీని కూడా ఈ ఫ్యామిలీ బిల్డ్ చేసుకుందట. సో పన్నులు ఎక్కువైనా ప్రశాంతమైన జీవితం, మంచి వాతావరణం తమను ఇండియాకు రాకుండా చేస్తున్నాయని ఈ తెలుగు అమ్మాయి అంటోంది.