బ్రేకప్ చెప్పిన అమ్మాయి..ఇంటిపై పెట్రోల్ బాంబులు

బ్రేకప్ చెప్పిన అమ్మాయి..ఇంటిపై పెట్రోల్ బాంబులు

ప్రేమిస్తే ఏంచేస్తారు..? పార్టినర్ బాగు కోరుతారు. ఇష్టాఇష్టాలు తెలుసుకుంటారు.. కష్టకాలంలో అండగా ఉంటారు.. ఆపద సమయంలో రక్షణగా ఉంటారు.. ఆమెను సంతోషంగా ఉంచడం కోసం ప్రయత్నిస్తారు.. ఒకవేళ బ్రేకప్ చెప్పినా ఆమె క్షేమమే కోరుకునే వాళ్లు చాలామంది.. కానీ వీడు చేసిన పని చూడండి.. ప్రేమించిన యువతి ఇంటిమీద పెట్రో బాంబులు వేసి తగలబెట్టాడు. తమిళనాడులో కోయంబత్తూరు జిల్లాలోని తొండముత్తూర్ ఏరియాలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో అమ్మాయిల సేఫ్టీపై  నెట్టింట హాట్ హాట్ చర్చ సాగుతోంది. 

వైరల్ అవుతున్న వీడియోలో  బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఇంటి గేటుముందు నిలబడి పెట్రో బాంబు విసిరి పారిపోతూ మరో బాంబు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంటి ఆవరణలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లోవాళ్లు, చుట్టుపక్కల వాళ్లు భయంతోపరుగులు పెట్టారు. మంటలార్పేందుకు ప్రయత్నించారు. ఇదంతా సీసీఫుటేజ్ లో రికార్డయ్యింది. 

ఇక ఈ వీడియో సోషల్ మీడిలో X లో పోస్ట్ షేర్ చేశారు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఐదు లక్షలమంది చూశారు. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తమిళనాడులో మహిళల సేఫ్టీలో ఆందోళన చెందారు కొందరు. మరికొందరు గతంలో తమిళనాడులో జరిగిన సంఘటనలు గుర్తు చేశారు. మహిళల సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇంకా మరికొందరు నెటిజన్లు జెన్ జెడ్ కిడ్స్ లో పెరుగుతున్న హింసాత్మక ప్రవర్తనపై ఆందోళన చెందారు. కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. 

కొందరు రాజకీయంగా కూడా స్పందించారు. డీఎంకే పాలనలో కూడా ఇలాగే జరిగింది.  ఇప్పుడు విజయ్ పాలనలో కూడా కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వాలు మారినా, పరిస్థితులు మారడం లేదు.. ప్రజల కోరుకున్న ప్రభుత్వాలు ఎక్కడా.. తక్షణమే విజయ్ ప్రభుత్వం స్పందించాలి.. వెంటనే టాస్మాక్ దుకాణాల(మద్యం )ను మూసివేయాలి. 20వేల మంది కొత్త పోలీసులను అపాయింట్ చేయాలి అంటూ  డిమాండ్లను పెట్టారు నెటిజన్లు.