- 52 లక్షల మంది ఓట్లు ఓకే చేశాం
- ఖైరతాబాద్ సెగ్మెంట్ పరిధిలో
- 80 వేల మందికి నోటీసులు జారీ
- 20% మంది సమాధానం ఇచ్చారు
- సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడి
- బీఎల్ వోలు ఓటర్ల ఇంటికే వస్తరు: సీఈఓ సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువును మరోసారి పొడిగించే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుద ర్శన్ రెడ్డి స్పష్టంచేశారు. గురువారం బీఆర్కే భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 92 లక్షల మందికి అధికారి కంగా నోటీసులు జారీ చేశామని, అందులో 65 లక్షల మంది హాజరై సమాధానాలు ఇచ్చారని వెల్లడించారు. ఇందులో ఇప్పటికే సమగ్రంగా ధ్రువీకరించిన 52 లక్షల మంది ఓటర్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రధాన ఓటర్ల జాబితా (మెయిన్ రోల్)లోకి తీసుకున్నా మని తెలిపారు. ఇంకా కేవలం మూడు లక్షల మందికి సంబంధించిన నోటీసుల సమాధానాలు మాత్రమే వివిధ దశల్లో పెండింగులో ఉన్నాయని వివరించారు. మిగిలిన 40 లక్షల అనామాలీస్ కు సంబంధించిన
డేటా ధ్రువీకరణ, పత్రాల సేకరణ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోందని సుదర్శన్రెడ్డి తెలిపారు. మరోవైపు ఖైరతాబాద్ ఉపఎన్నిక అంశం పైస్పందిస్తూ, ఈ విషయం పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పరిధిలో ఉందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్, హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను ఇప్పటికే ఈసీకి పంపించినట్లు వెల్లడించారు. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గంలో దాదాపు 80 వేల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు కేవలం 20 శాతం మంది మాత్రమే సమాధానాలు ఇచ్చారని సీఈవో పేర్కొన్నా రు. అక్కడ మిగిలిన వారి వివరాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని, నవంబర్ 5 లోగా అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్ల తుది జాబితాలోకి తీసుకొచ్చేలా క్షేత్ర స్థాయి బృందాలు కృషి చేస్తున్నాయని వివరించారు
ఫాం 6కు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే
సర్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కల గకుండా ఈసీ కీలక మార్పులు చేసిందని సీఈఓ వెల్లడించారు. ఇప్పటివరకు నోటీసులు అందుకున్న సాధారణ పౌరులు తమ వివరాల నమోదు, ధ్రువీక రణ కోసం బూత్ స్థాయి అధికారుల (బీఎల్వో) కార్యా లయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని సీఈఓ స్పష్టం చేశారు. కొత్తనిబంధనలు ప్రకారం క్షేత్రస్థాయి యంత్రాంగమే స్వయంగా నోటీసులు జారీ అయిన ఓటర్ల ఇండ్ల వద్దకు వెళ్లి అవ సరమైన పత్రాలను సేకరిస్తుందని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన మరింత వేగవంతంగా, పారదర్శ కంగా సాగేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుంద న్నారు. గతంలో ఎదురైన క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను మరింత సరళతరం చేసిందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే బీఎల్ వోలు అంతా ప్రభుత్వ ఉద్యోగులేనని, వారెవరూ రాజకీయ పార్టీలకు చెందిన వారు కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. ఓటరు
ధ్రువీకరణ ప్రక్రియలో కుటుంబ సభ్యులందరూ పనులను వదులుకుని అధికారుల వద్దకు హాజరు కావాల్సిన అవసరం లేదని సీఈవో వెల్లడించారు. నోటీసు అందిన కుటుంబం నుంచి ఒక్క ప్రతినిధి సంబంధిత వివరాలు, ధ్రువీకరణ పత్రాలు అధికా రులకు అందజేస్తే సరిపోతుందని నిబంధనలను సవరించినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఫామ్ 6 సమర్పణకు సంబంధించి నిబంధనలలో స్పష్టత నిచ్చిన ఆయన, సర్ అమలవుతున్న రాష్ట్రాల్లో కొత్త ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసేటప్పుడు తప్పని సరిగా డిక్లరేషన్ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, సర్ ప్రక్రియ అమలులో లేని ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఫామ్ 6 తో పాటు ప్రత్యేకంగా డిక్ల రేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ నిబంధనలు. పేర్కొంటున్నాయని స్పష్టం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కు నమోదులో ఎలాంటి సాంకేతిక ఇబ్బం దులు ఎదుర్కోకుండా అధికారులు తగిన సహకారం అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ పేరుతో ప్రజలను గంటల తరబడి వేచి ఉండేలా చేసే పద్ధ తులకు స్వస్తి పలికి, కేవలం డాక్యుమెంట్ల సేకరణకే ప్రాధాన్యం ఇవ్వాలని సీఈఓ సూచించారు.
