- 22 నుంచి ఫిబ్రవరి 7 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం విడుదల చేసింది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల మార్కులు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
మెరిట్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని, పూర్తి వివరాలను వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలని బోర్డు సూచించింది.
