జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. సాప్ట్వేర్ ఉద్యోగి మానస (27) మంగళవారం ఉదయం ఆఫీస్కు నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలోని12 గ్రాముల బంగారు గొలుసును గుర్తు తెలియని యువకుడు బైక్పై వచ్చి లాక్కొని పరారయ్యాడు.
మాదాపూర్ హాస్టల్ నుంచి రోడ్ నెంబర్ 39లోని ఆఫీసుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని చైన్ స్నాచర్ కోసం గాలిస్తున్నామని జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎం. సత్యనారాయణ తెలిపారు.
