చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభం

V6 Velugu Posted on Oct 21, 2021

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమైంది. TDP కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి... రాష్ట్ర వ్యాప్తంగా TDP కార్యాలయాలపై  YCP నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా ఆయన దీక్ష చేస్తున్నారు. మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే చంద్రబాబు దీక్షకు కూర్చొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా వివిధ జిల్లాల నుంచి ముఖ్యనేతలంతా అక్కడికి చేరుకున్నారు. రేపు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.  

ఏపీ మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందని ఆవేదనతో పోరాడుతుంటే... తమపై దాడికి దిగుతున్నారని  TDP నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారన్నారు. రెండున్నరేళ్లలో పోలీస్  వ్యవస్థను DGP భ్రష్టుపట్టించారన్నారు. జగన్ , YCP  నేతలు వాడిన పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. సీఎం, డీజీపీ కుట్రచేసి.. చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారని ఆరోపించారు.  ఇంటి తర్వాత పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారన్నారు అచ్చెన్నాయుడు.

Tagged TDP, protest, Chandrababu,

Latest Videos

Subscribe Now

More News