ఏపీ 420 చేతుల్లో పడింది...   విజన్ 2020 కాదు 2047

ఏపీ 420 చేతుల్లో పడింది...   విజన్ 2020 కాదు 2047

హైదరాబాద్‌ అభివృద్ధిలో విజన్ 2020 కనిపిస్తోందని,  కాని విజన్ 2047 లక్ష్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు  అభిప్రాయపడ్డారు. రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్‌ పబ్లిక్ పాలసీ గ్రాడ్యుయేట్ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విధానాల రూపకల్పన, సంస్కరణలు, పాలనలో టెక్నాలజీ అంశంపై ప్రసంగించారు. 

పబ్లిక్ పాలసీపై ఏమన్నారంటే..

ప్రజల జీవితాలను ప్రభావితం చేయడంలో పబ్లిక్ పాలసీ కీలకమన్నారు. 25 ఏళ్లలో హైదరాబాద్ ఎలా అభివృద్ది చెందిందో అందరికి తెలుసన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజన్ 2020 లక్ష్యంగా పనిచేశామంటూ.. ప్రస్తుతం  రాష్ట్రం 420  చేతుల్లో పడి అదోగతి పాలయ్యిందన్నారు.  ఆర్ధిక సంస్కరణలను మన  దేశంలో ప్రవేశపెట్టేందుకు తాను ఎంతో కృషి చేశానన్నారు.

పబ్లిక్ పాలసీ సంస్థకు కౌటిల్య అనే మంచి పేరు పెట్టారని ప్రశంసించారు. కౌటిల్యుడి పేరు నిలబెట్టేలా విద్యార్థులు రాణించారని పిలుపునిచ్చారు. విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు ఎగతాళి చేశారని గుర్తుచేశారు. దేశ ప్రగతిని సంస్కరణలకు ముందు.. తర్వాత అని చెప్పుకోవాలన్నారు. 25 ఏళ్లలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.