
న్యూఢిల్లీ: కార్డియాలజీ సర్జరీలు చేసే డాక్టర్ కార్డియాక్ అరెస్టు కు గురై మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో కార్డియాక్ సర్జన్ గా పనిచేస్తున్న డా. గ్రాడ్లిన్ రాయ్ బుధవారం విధుల్లో భాగంగా వార్డుల్లో రౌండ్స్ లో ఉండగా ఒక్కసారిగా కార్డియాక్ అరెస్టుకు గురయ్యాడు. అతడిని కాపాడటానికి సహచర డాక్టర్లు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ, గ్రాడ్లిన్ రాయ్ ప్రాణాలు కోల్పోయారు.
న్యూరాలజిస్ట్ సుధీర్ కుమార్ ఈ విషయాన్ని ‘ఎక్స్’ లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పేషెంట్ల ప్రాణాలను కాపాడే డాక్టర్ ఇలా మృతి చెందడం ఆందోళనకరమైన విషయమని ఆయన తెలిపారు. దీర్ఘకాలిక పనిగంటలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మెంటల్ స్ట్రెస్, శారీరక వ్యాయామం లేకపోవడం కారణమని చెప్పారు.