- రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో ఎదుగుదల సమస్యలు
- 16 జిల్లాల్లో 22% మంది ఎత్తుకు తగ్గ బరువు లేరు
- 9 జిల్లాల్లో 33% మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు
- 16 జిల్లాల్లో 32% పిల్లలు అండర్ వెయిట్
- 70% మంది పిల్లల్లో రక్తహీనత.. మహిళల్లోనూ పెరిగిన ఎనీమియా
- ఇటీవల రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- 16 జిల్లాల్లో 22% మంది ఎత్తుకు తగ్గ బరువు లేరు
- 9 జిల్లాల్లో 33% మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు
- 70 శాతం మంది పిల్లల్లో రక్తహీనత
- ఇటీవల రాజ్యసభలో 2019-21 లెక్కలు చెప్పిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బాల్యం బక్కచిక్కిపోతున్నది. పిల్లల్లో ఎదుగుదల లోపం ఎక్కువైతున్నది. సమస్య తీవ్రత జాతీయ సగటు కన్నా అధికంగా నమోదు అవుతున్నది. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటాతో ఈ విషయం వెల్లడైంది. 2019–2021 మధ్య దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పిల్లల ఎదుగుదల, మహిళల్లో రక్తహీనతపై నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటాను కేంద్రం వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం మన రాష్ట్రంలోని19 జిల్లాల్లో ఐదేండ్లలోపు చిన్నారుల్లో 22 శాతం పిల్లలు వేస్టింగ్ (ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం) సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇది జాతీయ సగటు 20 శాతంతో పోలిస్తే 2 శాతం ఎక్కువ. 16 జిల్లాల్లో 32 శాతం పిల్లలు అండర్ వెయిట్ (వయసుకు తగ్గ బరువు లేకపోవడం)గా ఉన్నారు. 9 జిల్లాల్లో 33 శాతం పిల్లలు స్టంటింగ్ (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం)తో అవస్థలు పడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 35 శాతం మంది పిల్లలు ఎదుగుదల లోపించి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు నివేదికలో వెల్లడైంది. జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ స్టంటింగ్ సమస్య తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ఇటు రక్తహీనత (ఎనీమియా)తో బాధపడుతున్న మహిళల సంఖ్య కూడా పెరిగింది. 2015–16లో 15–49 ఏండ్ల మధ్య ఉన్న మహిళల్లో 56.6 శాతం మంది రక్తహీనతతో బాధపడగా.. 2019–21 నాటికి అది 57.6 శాతానికి పెరిగింది. పిల్లల్లో ఏకంగా 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
2015 - 16లో తక్కువే
పిల్లల్లో ఎదుగుదల, మహిళల్లో రక్తహీనత సమస్యలు 2015–16తో పోలిస్తే 2019–2021 మధ్య పెరిగాయి. 2015-–16లో స్టంటింగ్ 28 శాతం ఉండగా, వేస్టింగ్18 శాతం, అండర్‌వెయిట్ పిల్లలు 28 శాతం ఉన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న పిల్లల సంఖ్య 61 శాతంగా ఉంది. మహిళల్లో అండర్ వెయిట్ సమస్య తగ్గినా రక్తహీనత సమస్య మాత్రం పెరిగింది.
ఐదేండ్ల లోపు పిల్లల్లో ఇలా..
స్టంటింగ్ (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం)
సమస్య ఉన్న పిల్లలు8,82,645
ఈ జిల్లాల్లో అత్యధికం..
రంగారెడ్డి 1,73,073
మహబూబ్‌నగర్ 1,55,653
హైదరాబాద్ 1,02,126
ఆదిలాబాద్ 98,116
మెదక్ 94,749
వేస్టింగ్ (ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం)
సమస్య ఉన్న పిల్లలు 5,18,647
ఈ జిల్లాల్లో అత్యధికం..
నల్గొండ 77,602
మహబూబ్‌నగర్ 65,038
రంగారెడ్డి 63,643
ఆదిలాబాద్ 63,335
హైదరాబాద్ 59,462
అండర్ వెయిట్ (వయసుకు తగ్గ బరువు లేకపోవడం)
సమస్య ఉన్న పిల్లలు 8,06,558
ఈ జిల్లాల్లో అత్యధికం..
రంగారెడ్డి 1,35,070
మహబూబ్‌నగర్ 1,20,576
ఆదిలాబాద్ 1,11,642
మెదక్ 1,09,326
నిజామాబాద్ 76,910
రక్తహీనత (ఎనీమియా)
సమస్య ఉన్న పిల్లలు 16,34,760
ఈ జిల్లాల్లో అత్యధికం..
రంగారెడ్డి 3,11,768
మహబూబ్‌నగర్ 2,71,114
హైదరాబాద్ 1,91,931
నల్గొండ 1,74,275
మెదక్ 1,63,680
రాష్ట్రంలో15-49 ఏండ్ల మధ్య మహిళల్లో ఇలా..
అండర్‌వెయిట్ మహిళలు 17,76,043
ఈ జిల్లాల్లో అత్యధికం..
మహబూబ్‌నగర్ 2,76,716
రంగారెడ్డి 2,40,986
కరీంనగర్ 2,34,382
మెదక్ 2,25,217
ఆదిలాబాద్ 2,16,810
రక్తహీనత (ఎనీమియా)
సమస్య ఉన్న మహిళలు 54,51,014
ఈ జిల్లాల్లో అత్యధికం..
రంగారెడ్డి 8,92,458
కరీంనగర్ 7,10,414
హైదరాబాద్ 6,51,487
మహబూబ్‌నగర్ 6,48,050
నల్గొండ 5,68,187
