27న హుజురాబాద్ కు సీఎం కేసీఆర్

V6 Velugu Posted on Oct 17, 2021

హైదరాబాద్ : ఈనెల 27న హుజురాబాద్ లో ప్రచార సభకు హాజరు కావాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మనమే గెలుస్తున్నామని పార్టీ నేతలకు తెలిపారు కేసీఆర్. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన TRSLP, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా వరంగల్ లో  నవంబర్‌ 15న ప్రజాగర్జన సభ నిర్వహించాలని సూచించారు. రోజూ 20 నియోజకవర్గాల నేతలతో  తెలంగాణ భవన్ లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈసారి ముందస్తుకు వెళ్లడం లేదని నేతలకు క్లారిటీ ఇచ్చారు సీఎం. వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా నేతలు పనిచేయాలన్నారు కేసీఆర్. 

Tagged meeting, CM KCR, Election Campaign, Huzurabad,

Latest Videos

Subscribe Now

More News