హెచ్-సిటీ పనులను స్పీడప్ చేయాలి : సీఎంసీ కమిషనర్ సృజన 

 హెచ్-సిటీ పనులను స్పీడప్ చేయాలి : సీఎంసీ కమిషనర్ సృజన 
  • సీఎంసీ కమిషనర్ సృజన 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హెచ్ సిటీ పనులను స్పీడప్​ చేయాలని సీఎంసీ కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ఇంజినీరింగ్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీ పరిధిలో చేపట్టనున్న నాలాల అభివృద్ధి పనుల కోసం ఇరిగేషన్ అధికారులు, సీఎంసీ ఇంజినీర్లు, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించారు.