పేదలకు అండగా CMRF : PCC వైస్ ప్రెసిడెంట్ డాక్టర్‌‌‌‌‌‌‌‌ కోట నీలిమ

పేదలకు అండగా CMRF : PCC వైస్ ప్రెసిడెంట్ డాక్టర్‌‌‌‌‌‌‌‌ కోట నీలిమ

పద్మారావునగర్, వెలుగు: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ కొండంత అండగా నిలుస్తోందని పీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్​సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్​చార్జి డాక్టర్‌‌‌‌‌‌‌‌ కోట నీలిమ అన్నారు. బేగంపేట్‌‌‌‌‌‌‌‌డివిజన్‌‌‌‌‌‌‌‌ పాటిగడ్డ ప్రాంతానికి చెందిన రజియా బీకి సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ కింద మంజూరైన రూ.60 వేల ఆర్థికసాయం చెక్కును శనివారం అందజేశారు.