టెన్త్‌‌‌‌‌‌‌‌లో 100 శాతం ఫలితాలు సాధించాలి : కలెక్టర్ పమేలాసత్పతి

టెన్త్‌‌‌‌‌‌‌‌లో 100  శాతం ఫలితాలు సాధించాలి : కలెక్టర్ పమేలాసత్పతి
  • కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: రానున్న పదో తరగతి పరీక్షల్లో వందశాతం రిజల్ట్స్ సాధించేలా కృషి చేయాలని కలెక్టర్​పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం  కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో టెన్త్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌పై ఎంఈవోలతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టెన్త్‌‌‌‌‌‌‌‌లో 100 శాతం రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రత్యేక అధికారులు, టీచర్లు కృషి చేయాలన్నారు. అనంతరం ఇటుక బట్టీలు, పరిశ్రమల యజమానులతో కలెక్టర్ సమావేశమయ్యారు. వలస కూలీలు ఎక్కువగా పనిచేసే చోటే పిల్లలు చదువుకునేలా సమీప స్కూళ్లలో ప్రత్యేక తరగతిలో బోధిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా వలస కూలీలు, కార్మికుల పిల్లలను గుర్తించి వారిని ప్రత్యేక స్కూళ్లలో చేర్పించాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. ఇటుక బట్టీల యజమానులు పిల్లలకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.  

సమావేశంలో డీఈవో మొండయ్య,  క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఎంఈవోలు పాల్గొన్నారు.డెంటల్‌‌‌‌‌‌‌‌ క్యాంపులు నిర్వహించాలిమున్సిపల్, జీపీ శానిటేషన్‌‌‌‌‌‌‌‌ కార్మికులు, విద్యార్థులకు ఉచితంగా డెంటల్ క్యాంపులు నిర్వహించాలని, ఇందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ పమేలాసత్పతి గవర్నమెంట్ డాక్టర్లకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జీజీహెచ్ డెంటల్ డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. దంత సమస్యలు ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయాలని అన్నారు. అనంతరం ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఎన్​సీసీ క్యాడెట్లు ఆర్మ్డ్ ఫ్లాగ్ డే పురస్కరించుకుని చేపడుతున్న ఆర్మీ సహాయ నిధి విరాళాలను కలెక్టర్ ప్రారంభించారు.