ఇవాళ్టి నుంచి ఇంటింటికీ వ్యాక్సిన్

ఇవాళ్టి నుంచి ఇంటింటికీ వ్యాక్సిన్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి వచ్చే నెల చివరి వరకూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హెల్త్ వర్కర్లు ప్రతీ ఇంటికి తిరిగి, వ్యాక్సిన్ వేసుకోని వాళ్లను గుర్తించి టీకా వేస్తారు. ఇందుకోసం ప్రతీ గ్రామానికి 2 టీంలు ఏర్పాటు చేస్తూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక టీం.. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ టీకా వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సినేషన్​ క్యాంపునకు తరలిస్తుంది. ఇంకో టీం గ్రామంలోని ఏదో ఒక చోట క్యాంపు పెట్టి టీకా వేస్తుంది. రాష్ట్రంలో 16.36 లక్షల మంది సెకండ్ డోసు వ్యాక్సిన్​ తీసుకోవాల్సి ఉంది. 29.51 లక్షల మంది బూస్టర్ డోసుకు అర్హత పొందారు. 12 నుంచి 18 ఏండ్ల ఏజ్‌‌ గ్రూపు పిల్లల్లో 70,827 మంది కనీసం ఒక్క డోసు కూడా వేసుకోలేదు.