CSIRలో ఉద్యోగాలు.. బిటెక్ పాసైనోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు.. కొద్దిరోజులు ఛాన్స్..

CSIRలో ఉద్యోగాలు.. బిటెక్ పాసైనోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు.. కొద్దిరోజులు ఛాన్స్..

సీఎస్ఐఆర్ అడ్వాన్స్​డ్ మెటీరియల్స్ అండ్ ప్రొసెస్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (సీఎస్ఐఆర్ ఏఎంపీఆర్ఐ) జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అప్లికేషన్​లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 18.

పోస్టుల సంఖ్య: 08.

పోస్టులు: సీనియర్ రీసెర్చ్ ఫెలో 02, జూనియర్ రీసెర్చ్ ఫెలో 02, ప్రాజెక్ట్ సైంటిస్ట్–III , సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 01, ప్రాజెక్ట్ అసోసియేట్–I  02. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, ఎంఎస్సీ, ఎం.టెక్/ఎంఈ, ఎంఫిల్/ పీహెచ్​డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు.   

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ ‌04. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 18. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  ampri.res.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.