కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ పనులకు సీడబ్ల్యూసీ బ్రేక్

కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ పనులకు సీడబ్ల్యూసీ బ్రేక్

గోదావరి బోర్డుకు సీడబ్ల్యూసీ ఆదేశం

 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు రివైజ్డ్‌‌‌‌ డీపీఆర్‌‌‌‌ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్​ రిపోర్ట్​)ను పక్కన పెట్టాలని గోదావరి బోర్డును సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అడిషనల్‌‌‌‌ టీఎం సీపై సుప్రీంలో ఉన్న కేసులు, న్యాయ వివాదాలు తేలేదాకా డీపీఆర్‌‌‌‌ పరిశీ లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సీడబ్ల్యూసీ తాజా ఆదేశాలతో కాళేశ్వరం అడిషనల్‌‌‌‌ టీఎంసీకి బ్రేక్‌‌‌‌ పడ్డట్టు అయ్యింది.

మేడిగడ్డ నుంచి 195 టీఎంసీలు ఎత్తిపోసేం దుకు సీడబ్ల్యూసీ గతంలోనే అన్ని అనుమతులు ఇచ్చింది. తక్కువ రోజుల్లోనే 195 టీఎంసీలు ఎత్తిపోసేలా అడిషనల్‌‌‌‌ 
టీఎంసీ పనులు కూడా ప్రారం భించారు. ఈ పనులకు పర్మిషన్‌‌‌‌ లేదని కొందరు ఎన్‌‌‌‌జీటీకి, సుప్రీం కోర్టుకు వెళ్లారు. దాంతో పర్మిషన్‌‌‌‌ తీసుకునే దాకా పనులు చేపటొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.