బషీర్బాగ్, వెలుగు: అమ్మాయి పేరుతో వీడియో కాల్ చేసిన సైబర్ చీటర్లు, ఆ తరువాత బ్లాక్మెయిల్కు పాల్పడి డబ్బులు గుంజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. గౌలిగూడా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అక్టోబర్ 5న జ్యోతి గుప్తా పేరుతో వీడియో కాల్ వచ్చింది. అందులో ఓ మహిళ చనువుగా మాట్లాడింది.
అనంతరం సైబర్ చీటర్లు లైన్లోకి వచ్చి ఆ వీడియో రికార్డు చేశామని, సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. వీడియో కాల్లో ఉన్న మహిళ చనిపోయిందని, కేసు పెడుతామని బెదిరించారు. ఇలా రకరకాలుగా వేధించి పలుమార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇలా బాధితుడు పలు దఫాలుగా రూ.3,41,950 పోగొట్టుకున్నాడు. మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
