ఏఐ సహకారంతో మరింత ఎదగాలి: గడ్డం సరోజా వివేక్

ఏఐ సహకారంతో మరింత ఎదగాలి: గడ్డం సరోజా వివేక్
  •     ఏఐ వల్ల కొత్త అవకాశాలు వస్తయ్: సీఐఐ చైర్మన్ గౌతమ్ రెడ్డి 
  •     12వ తెలంగాణ లీడర్‌‌షిప్ కాంక్లేవ్‌లో ప్రసంగం 
  •     సీఐఐ అవార్డులు అందుకున్న గడ్డం సరోజ, గడ్డం రోషిణి 

హైదరాబాద్/మాదాపూర్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, అది మనుషుల విలువల ను, ఆలోచనలను నిర్ణయించడం సాధ్యం కాద ని ఇంజనీరింగ్, టెక్, ఎలక్ట్రానిక్స్​ తయారీ కంపెనీ సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. నాయక త్వానికి ఆత్మవిశ్వాసం, స్పష్టమైన లక్ష్యం, జీవ న అనుభవాలే కీలకమని ఆయన పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ మాదాపూర్‌‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సీఐఐ ఇండియన్ ఉమెన్  నెట్‌వర్క్ ఆధ్వర్యంలో 12వ ఎడిషన్ ‘తెలంగాణ లీడర్‌‌షిప్ కాంక్లేవ్ 2026’ నిర్వహించారు. ‘పవర్ ఆఫ్ ఏఐ: ఓన్ యువర్ ఐ’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సుకు మోహన్ రెడ్డి చీఫ్‌ గెస్టుగా హాజరై మాట్లాడారు. 

మహిళా నాయకులు తమ సొంత గుర్తింపును సమాజానికో లేదా ఏఐ కంప్యూటర్ ప్రోగ్రామ్‌లకో అప్పగించకూడదన్నారు. ప్రతి నాయకుడూ 'నేను ఎవరు? నా ఆదర్శాలు ఏమిటి? ఏఐ సహకారంతో నన్ను నేను ఎలా మరింత మెరుగుపరుచుకోవాలి?' అనే విషయాలపై స్పష్టత కలిగి ఉండాలని సూచించారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవని, కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయని సీఐఐ తెలంగాణ చైర్మన్ గౌతమ్ రెడ్డి చెప్పారు. మహిళల్లో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయని, వారికి సంస్థల్లో సరైన అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం సమాజ బాగుకోసం విశిష్ట సేవలందించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ సతీమణి గడ్డం రోషిణికి మంత్రి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ సీఐఐ అవార్డు అందజేశారు. 

 అవార్డు నా జీవితంలో గొప్ప మైలురాయి: రోషిణి

ఈ అవార్డు రావడం తన జీవితంలో గొప్ప మైలురాయి అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సతీమణి గడ్డం రోషిణి అన్నారు. భవిష్యత్తులో మరింత ఉత్సా హంగా పని చేయడానికి ఇది తోడ్పడుతుందని ఆమె అన్నారు. హైదరాబాద్​ బాగ్‌ లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీని సమష్టి కృషితో విజయవంతంగా నడుపుతున్నా మని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఐడబ్ల్యూఎన్ తెలంగాణ చైర్‌‌ వుమన్ సోనియా శ్రీకాంత్, వైస్ చైర్‌ వుమన్ తనూజ అబ్బూరి, పద్మశ్రీ అవార్డు గ్రహీత, నేత కార్మికుడు చింతకింది మల్లేశం తదితరులు పాల్గొన్నారు.