మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘ఆకాశంలో ఒకతార’. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తుండగా, శృతిహాసన్ కీలక పాత్ర పోషిస్తోంది.
గురువారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. నవంబర్ 20న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో దుల్కల్ సల్మాన్ మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
