హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని భూ దగాకు పాల్పడ్డ కల్వకుంట్ల కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో శిక్షించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం పిలుపునిచ్చారు. పదేండ్ల అధికార దర్పంతో తెలంగాణ భూములను కబ్జా చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు ఇకపై రాజకీయాల్లో కొనసాగే నైతిక అర్హత లేదని తెలిపారు.
ఈ మేరకు గురువారం గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల భూ భాగోతాన్ని బట్టబయలు చేయడంతో, వాటికి సమాధానం చెప్పలేక వారు డొంకతిరుగుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
