‘యూపీఐ’ చార్జీల బాదుడు ఆపాలి... సికింద్రాబాద్ లో భారీగా నిరసన కార్యక్రమం

‘యూపీఐ’ చార్జీల బాదుడు ఆపాలి... సికింద్రాబాద్ లో భారీగా నిరసన కార్యక్రమం
  • సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జాన్

పద్మారావునగర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం వ్యాపార యూపీఐ లావాదేవీలపై చార్జీల బాదుడును ఆపాలని సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్​దీపక్ జాన్ డిమాండ్​చేశారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్ లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

రూ.2 వేల కంటే ఎక్కువ లావాదేవీలపై 0.4 శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) విధించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు దీపక్ జాన్ తెలిపారు. అమెరికాకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, అగ్రరాజ్య ఒత్తిళ్లకు మోదీ ప్రభుత్వం తలొగ్గిందని ఆరోపించారు. ఎంపీ మల్లు రవి, డివిజన్ల అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.