కడియం వర్సెస్ రాజగోపాల్ రెడ్డి : అసెంబ్లీలో నువ్వెంతంటే నువ్వెంత

కడియం వర్సెస్ రాజగోపాల్ రెడ్డి : అసెంబ్లీలో నువ్వెంతంటే నువ్వెంత

అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ కొనసాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు గాను 53 వేల 196 కోట్ల రూపాయలు కేటాయించారని ఈ బడ్జెట్ ఆ గ్యారెంటీలకు సరిపోదని కడియం శ్రీహరి విమర్శించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ  420 హామీలు ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డికి ఏం తెలియదని కూర్చుని ఉండాలని అసెంబ్లీలో అన్నారు. హైదరబాద్ నగరం గురించి తెలియకపోతే తెలుసుకోవాలని సూచించారు.

కడియం శ్రీహరి తన పై చేసిన వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన గురించి మాట్లాడుతూ తనకు హోం మంత్రి పదవి వచ్చేది లేదు సచ్చేది లేదు అని కడియం శ్రీహరి అన్నారని వస్తుందా రాదా అనేది సీఎం నిర్ణయిస్తారని చెప్పారు. తాటికొండ రాజయ్యను రెండు సార్లు మోసం చేసిన చరిత్ర మీదని కడియం పై ఫైర్ అయ్యారు.  తెలంగాణ కోసం కొట్లాడి రాజీనామా చేసిన వ్యక్తిని అవమానకరంగా తీసేసి ఆ పదవిలో కూర్చున్న వ్యక్తి కడియం శ్రీహరి అని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆ మంత్రి పదవి పోయిందన్న ఫ్రస్టేషన్ లో  కడియం మాట్లాడుతున్నారని విమర్శించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు తిరిగి మంత్రి కాలేరని రాజగోపాల్ రెడ్డి అన్నారు.