
ముషీరాబాద్, వెలుగు: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్లను చివరి వర్కింగ్డే నాడే అందించాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెండింగ్పెట్టిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. గురువారం ఆయన బాగ్ లింగంపల్లిలోని ఆఫీసులో ఉద్యోగుల, ఉపాధ్యాయుల కన్వీనర్ జోగు శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఒక్కొక్క ఉద్యోగి దాదాపుగా 35 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించి పదవి విరమణ పొందాక, రిటైర్మెంట్బెనిఫిట్స్అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైసింగ్ అంటూనే మరోపక్క ఉద్యోగులను మానసిక వేదనకు గురిచేయడం తగదన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తులసి సత్యనారాయణ, ఎంబీసీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.