- బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్
ముషీరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు కోసం బీసీ నేతలు స్వచ్ఛందంగా కృషి చేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ కోరారు. బుధవారం బాగ్ లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో నవీన్ యాదవ్కు మద్దతుగా నిర్వహించిన సమావేశానికి పలు జిల్లాల బీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసు సురేశ్ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల అహంకారానికి.. బలహీనవర్గాల ఆత్మగౌరవానికి మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నదని అన్నారు.
లక్ష ఓటర్లు ఉన్న ముస్లింలు, మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్న యాదవులు, మున్నూరు కాపులు, గౌడులు, పద్మశాలీలు, ముదిరాజులు, ఎస్సీలు, రజకులు తమ ఓటును బీసీ బిడ్డ నవీన్ యాదవ్కు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గండి వీరేందర్ గౌడ్, మడత కిశోర్, వంగ రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
